ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

 

పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు

సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర అభినందనీయం

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

గత ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం

నర్సాపూర్ శాసనసభ్యురాలు సునీత రెడ్డి

మెరుగైన పిఆర్సి ఇచ్చిన ఘనత కేసీఆర్ దే

శాసన మండలి సభ్యులు సేరి సుభాష్ రెడ్డి

ప్రజల ఆకాంక్షల మేరకు పోరాడిన ఏకైక సంఘం టీఎన్జీవో

టీఎన్జీవో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దేవి ప్రసాద్

మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలి

టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్

మెదక్ నియోజకవర్గం జనవరి 28 ప్రజాబలం ప్రతినిధి :-

ఉద్యోగుల అన్ని రకాల సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించాలని పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక టీఎన్జీవో భవన్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ అధ్యక్షతన నిర్వహించిన స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం మరియు డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ఎంతో మనోవేదనకు గురవుతున్నారని వారి పట్ల కనికరంతో ప్రభుత్వం వ్యవహరించాలని, ఉద్యోగుల వయోపరిమితి పెంపు అని ఊహాగానాలు వస్తున్న తరుణంలో పెంపు ఆలోచన ఉన్నట్లయితే తక్షణమే విరమించుకోవాలని, పాత పెన్షన్ విధానం అమలు కోసం, ఆదాయపు పన్ను పరిమితి పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పార్లమెంటులో గళం విప్పి నా వంతు ప్రయత్నిస్తానని అన్నారు. అంతకుముందు కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వర్గాల ఉద్యోగులు విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని ఉద్యోగుల చేయుతతోనే జిల్లా అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతుందని జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఓటింగ్ శాతం రాష్ట్రంలోనే మెదక్ జిల్లా అగ్రా స్థానంలో నిలిచిందని అన్నారు, ఉద్యోగులు ఎవరి ఒత్తిడికి తలవగ్గని విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలవుతున్నాయని అందుకు కారణమైన ఉద్యోగులను అభినందించారు.

మునుముందు కూడా జిల్లా యంత్రాంగానికి సహకరించుకుంటూ జిల్లా అభివృద్ధికి దోహదపడాలన్నారు, నర్సాపూర్ శాసన సభ్యురాలు సునీతా రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో టీఎన్జీవో కీలక పాత్ర పోషించిందని గత ప్రభుత్వంలో ఉద్యోగులకు అన్ని రకాల న్యాయం జరిగిందని, సచివాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో స్వయంగా కెసిఆర్ గారి టీఎన్జీవో సంఘాన్ని కీర్తించిన సంఘటన గుర్తు చేశారు. శాసనమండలి సభ్యులు శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి అందజేసి ముఖ్యమంత్రి ఉద్యోగులను కడుపులో పెట్టుకొని చూసుకున్నారని అన్నారు. అంతకుముందు టీఎన్జీవో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ టీఎన్జీవోల సంఘం ఉద్యోగుల హక్కుల పరిరక్షణ సంక్షేమమే కాకుండా ప్రజల ఆశయాల ఆకాంక్షల మేరకు పోరాడిన ఏకైక సంఘం టీఎన్జీవో అన్నారు. జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా ఉద్యోగుల,నిరుద్యోగుల, విద్యార్థుల మరియు ప్రజల ఆకాంక్షల మేరకే జిల్లాకు సంబంధించి స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో మెదక్ జిల్లాను రాజన్న జోన్ నుండి చార్మినార్ జోన్ కు మార్చాలని, నీటిపారుదల శాఖ సర్కిల్ కార్యాలయాన్ని ఈ ఎన్ సీ ఇరిగేషన్ గజ్వేల్ యూనిట్ నుండి సి ఈ ఇరిగేషన్ సంగారెడ్డి యూనిట్కు అదేవిధంగా గత సంవత్సరం జిల్లా నుండి సిద్దిపేట జిల్లాకు తరలి వెళ్లిన ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ కార్యాలయాన్ని తిరిగి వెనక్కు తేవాలని ప్రధాన మూడు తీర్మానాలు రాష్ట్రానికి సంబంధించి నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానం ప్రవేశపెట్టాలని, 317 జీవో ప్రకారం సుదూర ప్రాంతానికి బదిలీ అయిన ఉద్యోగులను న్యాయం చేకూర్చాలని, పెండింగ్ బిల్లులు, కరువు భత్యం ఇతర బకాయిలు మరియు ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగుల జీతభత్యాలు వెంటనే చెల్లించాలని, ఆదాయపు పన్ను పరిమితి 10 లక్షలకు పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని ఏడు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మినికే రాజ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అనురాధ, పూర్వపు మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నూతన మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు శ్యామ్ రావు, జిల్లా సహాధ్యక్షులు ఇక్బాల్ పాషా, కోశాధికారి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ఫణి రాజ్, ఫజలుద్దీన్, ఎం కె టి అర్షద్, రఘునాథరావు, లీల, సంయుక్త కార్యదర్శులు, పోతురాజు శంకర్, శివాజీ, కిరణ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి, ప్రచార కార్యదర్శి నర్సింలు, క్రీడల కార్యదర్శి గోపాల్, కార్యవర్గ సభ్యులు మరియా, సతీష్, సలావుద్దీన్, మెదక్ నర్సాపూర్ రామయంపేట్ తూప్రాన్ అల్లాదుర్ ఏడుపాయల వనదుర్గ మరియు చేగుంట యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు రామా గౌడ్, శేషాచారి, ప్రభాకర్, శంకర్ గౌడ్, ధర్మాచందర్, సూర్య శ్రీనివాస్, రాకేష్, నిఖిల్ శ్రీనివాస్, ప్రశాంత్, విజయ్, పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షులు జంగం నగేష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు యాదగిరి గౌడ్, హాస్టల్ వెల్ఫేర్ ఫోరమ్ కార్యదర్శి శేఖర్, వెటర్నరీ ఫోరం కార్యదర్శి లింగమూర్తి, మెడికల్ ఫోరం కార్యదర్శి మంజుల, గ్రంథాలయ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు శంకర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫోరం జిల్లా అధ్యక్షులు సాయి యాదవ్, ప్రణయ్ శివరాం, తులసి రామ్, మహేందర్, విక్రమ్ స్వామి, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking