రాజన్న సిరిసిల్ల ,జనవరి 28, (ప్రజాబలం ప్రతినిధి)
కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత జిల్లాలోని ఆరోగ్య ఉప కేంద్రాలను సందర్శించినారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో బొప్పాపూర్ ఆరోగ్య ఉప కేంద్రం సందర్శించి వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య కార్యక్రమాలలో లక్ష్యాలను సాధించి జిల్లాని ముందు భాగంలో ఉంచాలని సూచించినారు. వీర్న పల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను ఆరోగ్య శిబిరము నిర్వహించి బాలికలకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగినది. బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలియజేస్తూ వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా దుస్తులు శుభ్రంగా ధరించాలని,తడి ఆరిన బట్టలను మాత్రమే ధరించాలని, ఒకవేళ తడి బట్టలు ధరించినచో దురద అంటువ్యాధి సోకే ప్రమాదం ఉందని,ఈవ్యాధి ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉందని, అలాగే తలను శుభ్రంగా దువ్వు కొననియెడల పేను లాంటి(పెడిక్లోసిస్) అంటువ్యాధి ఒకరి నుంచి ఒకరికి ప్రజలునని, బాలికలు వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా బహిష్టు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.కౌమార దశలో వయసు ప్రకారము శరీరక బరువు, పెరుగుదల ఉండాలని, రక్తహీనత లేకుండా సమతుల ఆహారం భుజించాలని ఈ సందర్భంగా బాలికలకు అవగాహన కల్పించినారు. వసతి గృహ పరిసరాలను వంటగదిని, ఆహార పదార్థాలను పరిశీలించినారు. ఈ సందర్భంగా వంట మనుషులకు వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించినారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సారియా, డీడియం కార్తీక్, సూపర్వైజర్లు ఏఎన్ఎంలు పాల్గొన్నారు.