విదేశాలలో పని చేయుట కొరకు ఉపాధి అవకాశం

 

జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం రజని కిరణ్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 01: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్(టి.ఓ.ఎం.సి.ఓ.ఎం.),తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి,శిక్షణ, కర్మాగారాల శాఖ క్రింద రిజిస్టర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా నైపుణ్యం కలిగిన, సెమీ స్కిల్డ్ కార్మికులకు విదేశీలలో ఉపాధి అవకాశం కల్పించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.రజని కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. టి.ఓ.ఎం.సి.ఓ.ఎం. గల్ఫ్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా,కెనడా, జర్మనీ,హంగేరి, జపాన్,పోలాండ్, రొమేనియా,యు.కె. యు.ఎ.ఈ.,సౌది వంటి వివిధ దేశాలలో ప్రభుత్వ,ప్రైవేట్ నమోదిత ఏజెన్సీలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుందని, యు.ఎ.ఈ.లో బైక్ రైడర్స్(డెలివరీ బాయ్స్ కు అధిక డిమాండ్ ఉందని, అభ్యర్థులు ప్రభుత్వంచే జారీ చేయబడి కనీసం 3 సం॥లు పూర్తి అయిన ద్విచక్ర వాహన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి 21-40 సం॥ల మధ్య వయస్సు ఉండాలని తెలిపారు. ఆకర్షణీయమైన జీతం ప్యాకేజీతో, సురక్షితమైన, చట్టబద్దమైన వలస మార్గాల ద్వారా రిక్రూట్మెంట్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ నవీకరించిన రెస్యూమ్ను tomcom.resume@gmail.com ఈ-మెయిల్ చేయాలని,ఇతర వివరాల కొరకు ఆన్ లైన్లో,www.tomcom.telangana.gov.in వెబ్ సైట్లో,సంప్రదించవచ్చని,9440051285, 9440048500, 9701040062, 9440051452 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking