మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 01 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని రంగపేట ప్రాథమిక పాఠశాలలో 2011 నుండి 2024 వరకు పని చేసి బదిలీ పై వెళ్తున్న టీచర్ తిప్పని లావణ్య ను డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వారసుల కాలనీ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా బి ఆర్ అంబేద్కర్ నాయకులు మాట్లాడుతూ…తిప్పని లావణ్య టీచర్ ఎంతో మంది పిల్లకు ఉన్నతమైన విద్యను అందించి,పిల్లలు పోటీ పరీక్షలలు ఎంపికైయే విదంగా పిల్లలకు బోధన అందించి పిల్లలకు చదువు కోసం ఎంతగానో కృషి చేసినారు వారు పిల్లలకు చేసిన చేవ ఎన్నటికీ గ్రామ ప్రజలు మర్చిపోలేరు, అనంతరం టి కల్పన మేడం కి స్వాగతం పలికి వారిని సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎన్ తిరుపతి,అంబేద్కర్ జిల్లా కమిటీ నాయకులు చిప్పకుర్తి నారాయణ, మండల నాయకులు తోటపల్లి మహేందర్, తోటపల్లి సతీష్,కోడిజుట్టు స్వామి,కలమడుగు సిసింద్రీ,కోడిజుట్టు శివ, కలమడుగు శ్రీకాంత్, బిరుదుల అక్షయ్,మంతెన ప్రతిప్,దాసరి గోవర్ధన్, టీచర్స్,పేరెంట్స్ పిల్లలు పాల్గొన్నారు.