ఎలాంటి వేధింపులకైన గురయ్యే మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి,
మొబైల్ నందు QR కోడ్ స్కానర్ ను కలిగి ఉండాలి.
షీటీమ్ కంప్లైంట్ QR కోడ్ https://qr.tspolice.gov.in
మహిళలు మౌనం వీడి, నిర్భయంగా ముందుకు రండి, వేధింపుల నుండి బయటపడండి.
ఫిర్యాదు వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
జిల్లా ఎస్.పి డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.
ప్రజాబలం దినపత్రిక
మెదక్ జిల్లా ప్రతినిధి
1.10.2024:
మెదక్ షీటీమ్స్ సెప్టెంబర్ నెలలో ఇప్పటి వరకు నిర్వహించిన అవేర్నెస్ కార్యక్రమాల వివరాలు
జిల్లా వ్యాప్తంగా ఈవ్ టీజర్స్ పట్టుకొని 01 ఎఫ్ ఐ ఆర్ కేసులు 01 ఈ పెట్టి కేసు నమోదు చేయడం జరిగినది.
రెడ్ హాండ్ గా తూప్రాన్ సబ్ డివిజన్ లో 9 మందిని, మెదక్ సబ్ డివిజన్ లో 12 మంది మొత్తం 21 మందిని పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.
హాట్స్పాట్ 115
షీ టీమ్స్ బృందాలు 147 సార్లు హాట్స్పాట్ సందర్శించి 11 అవగాహన కార్యాక్రమాలు నిర్వహించడం జరిగింది
మెదక్ జిల్లాలో మెదక్, తూప్రాన్ డివిజన్ల వారీగా షీ టీమ్స్
మెదక్ జిల్లాలో ఉన్న షీ టీమ్స్ బృందాలు ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో, తెలంగాణ మోడల్ స్కూళ్లలో, రెసిడెన్షియల్ స్కూల్ లలో కేజీబీవీ స్కూళ్లలో విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ మత్తు పదార్థాల అనర్దాలపై అవగాహన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
మెదక్ డివిజన్ షీ టీమ్స్ (58) హాట్స్పాట్, (72) సార్లు సందర్శించడం జరిగింది మరియు ప్రభుత్వ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.
తూప్రాన్ డివిజన్ షీ టీమ్స్ (57) హాట్స్పాట్, (75) సార్లు సందర్శించడం జరిగింది, మరియు ప్రభుత్వ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.
ఈ సందర్భగా జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ… షీ టీమ్స్ ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తాయని తెలిపారు. షీటీమ్ కంప్లైంట్ QR కోడ్ గురించి తెలియజేస్తూ ఆన్లైన్ ద్వారా ఎక్కడి నుండి అయిన పిర్యాదు చేసేందుకు ఉపయోగపడే ఈ షీటీమ్ కంప్లైంట్ QR కోడ్ స్కానింగ్ పోస్టర్స్ ను జిల్లాలో బస్ లలో, బస్ స్టాండ్ లలో, సినిమా హల్ లు, స్కూల్స్, కళాశాలలు, ఇతర ముఖ్యమైన, రద్దీ ప్రాంతాలలో అతికించబడి ఉంటాయని జిల్లాలో ఎవరైనా బాధిత మహిళలు షీటీమ్ కు పిర్యాదు చేయదలుచుకున్నప్పుడు ముందుగానే తమ మొబైల్ నందు QR కోడ్ స్కానర్ ను కలిగి ఉండాలని తమ ఫోన్ తో పోస్టర్ పై ఉన్న QR కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా https://qr.tspolice.gov.in అనే లింక్ వస్తుంది దీనిని క్లిక్ చేయగానే పిర్యాదు ఫోరం ఓపెన్ అవుతుంది. అందులోని పేరు, లొకేషన్ తదితర వివరాలను పూరించి సబ్మిట్ చేయగానే జిల్లా పోలీస్ కార్యాలయంలో షీటీమ్ సాఫ్టువేర్ విభాగానికి చేరుతుంది. అక్కడ నిరంతరం పర్యవేక్షించే సిబ్బంది ఎప్పటి కప్పుడు ఆన్లైన్ లో వచ్చే ఫిర్యాదులను స్వీకరించి ఆలొకేషన్ కు దగ్గరలో ఉన్న పోలీస్ అధికారులకు ఫార్వర్డ్ చేయడం ద్వారా సంబంధిత అధికారులు లొకేషన్ కు చేరుకొని తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎలాంటి వేధింపులకైన గురయ్యే మహిళలు షీటీంకు పిర్యాదు చేయదలచుకునే మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మహిళల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అంతే కాకుండా మహిళలు అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సూచించారు. ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100 లేదా షీటీమ్ వాట్సప్ నెంబర్ 8712657963, 6303923823 పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712657888 , లకు ఫోన్ చేసినచో మరియు ( షీ టీమ్ మెదక్ జిల్లా ఫేస్ బుక్, మెయిల్ sheteammedakdistrict@gmail.com), (ట్విట్టర్,@Msheteam) పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుంటామని మరియు ఫోన్ చేసిన వారి నెంబరు పేర్లు గోప్యంగా ఉంచుతామని మహిళలు మరియు బాలికల రక్షణ గురించి షీటీమ్స్ పని చేయడం జరుగుతుందని, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే వాట్సప్ నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని మీకు తెలియకుండా పోలీసులు సివిల్ డ్రస్ లలో ముఖ్య కూడళ్ళల్లో తిరుగుతున్నారని అలాగే చదువుకునే విద్యార్థినిలకు 18 సంవత్సరాలు నిండకుండానే వివాహము చేస్తున్నట్లుగానే తెలిస్తే వెంటనే 1098 కు తెలియజేయాలని మరియు యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ యూనిట్ను మెదక్ జిల్లాలో ప్రారంభించడం జరిగిందని మనుషుల అక్రమ రవాణా జరిగితే వెంటనే సమాచారం అందించాలని ఆర్గనైజ్డ్ నేరాలు చేసే వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు.
జిల్లా ఎస్.పి డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. గారి పర్యవేక్షణలో తూప్రాన్ డి.ఎస్.పి వెంకట్ రెడ్డి మరియు మెదక్ డి.ఎస్.పి ప్రసన్న కుమార్ గారి ఆద్వర్యంలో షీటీమ్స్ బృందాలు పని చేయడం జరుగుతుంది. షీటీమ్ సిబ్బంది శ్రీమతి లక్శ్మి ఏ ఎస్ ఐ గారు, శ్రీమతి రుక ఏ ఎస్ ఐ కానిస్టేబుళ్లు ప్రమీల , విజయ్, స్వరూప,శ్రీనివాస్ లు వారి వారి డివిజన్ల వారిగా విధులు నిర్వహించడం జరుగుతుంది