-సరైన సమయంలో వైద్యం అందించకపోతే ప్రమాదం
-యశోద ఆసుపత్రిలో అత్యాధునిక టెక్నాలజీతో వైద్య సేవలు
-యశోద ఆసుపత్రి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ జి. వరుణ్ రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా మార్చి 14 :మెదడువాపు వ్యాధి మళ్ళీ ప్రబలుతోంది ఈ వ్యాధికి సరైన సమయంలో గుర్తించి వైద్యం అందించటం ద్వారా రోగికి ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడవచ్చు అని యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ జి. వరుణ్ రెడ్డి తెలిపారు.గురువారం హనుమకొండలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద ఆసుపత్రి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ జి. వరుణ్ రెడ్డి మాట్లాడుతూ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది.తద్వారా వైరస్ సోకిన ప్రాంతమంతా బాగా వాయడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఈ వాపు వెన్నెముకకు కూడా పాకవచ్చని ఆయన తెలిపారు. వైద్య పరిభాషలో మెనింజో ఎన్ సెఫిలిటిస్ అని పిలిచే ఈ జబ్బును సామాన్య భాషలో మెదడువాపుగా వ్యవహరిస్తారు.తలనొప్పి,మెడ కొయ్యబారడం మెడనొప్పి,జ్వరం, నిస్త్రాణ,ముక్కుకారడం,వాంతులు కావడం,కండరాల బలహీనత, మాట్లాడడానికి ఇబ్బంది,కాంతిని సహించలేకపోవడం,సరిగా ఆలోచించలేకపోవడం,మాట్లాడలేకపోవడం,విచిత్రంగా ప్రవర్తించడం లాంటివి మెదడువాపు వ్యాధి సోకిన వారికి సాధారణంగా కనిపించే లక్షణాలు అని అన్నారు.మెదడు వ్యాపు వ్యాధిని సరైన సమయంలో గుర్తించి వైద్యం అందించకపోతే రోగి ప్రాణాలకే ప్రమాదం అని ఆయన తెలిపారు. జ్వరం,తలనొప్పి,నిరంతరాయంగా ముక్కు కారడం,తుమ్ములు లక్షణాలతో ఉన్న ఓ యువకుడిని హైదరాబాద్, మలక్ పేట యశోదా ఆసుపత్రికి తీసుకొచ్చారు.బయట మరో ఆసుపత్రిలో చికిత్స చేసిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ఈ యువకుడిని అతని బంధువులు యశోదా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది.ఆ యువకుడికి శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉండడంతో ముందుగా అతనికి ఆక్సిజెన్ అందించడం జరిగింది. అప్పటివరకూ జరిగిన చికిత్సను,వైద్య పరీక్షల రిపోర్టులను పరిశీలించిన యశోదా వైద్య బృందం అతనికి ఉన్న సమస్యను వైరల్ మెనింజ్ సిఫలిటిస్ గా గుర్తించి దానికి తగిన చికిత్సను అందించడం జరిగింది.ఈ కేసులో రోగికి క్యాల్సిఫైడ్ గ్రాన్యులోమా ఉండడం దాని చుట్టూ వాచి ఉండడం మరో క్లిష్టతరమైన అంశం.ట్రెయిన్ ఇమేజింగ్ ద్వారా యశోదా వైద్య బృందం ఈ సమస్యను సకాలంలో గుర్తించగలగడం వల్ల మెదడు వాపుతో పాటుగా ఈ సమస్యకు కూడా సమాంతరంగా చికిత్స చెయ్యడం జరిగింది. యాంటీపెలిఫ్టిక్స్ ఇవ్వడంతో రోగికి తుమ్ములు ఆగాయి.ఈ విధంగా సకాలంలో సరైన చికిత్సను అందించడంవల్ల రోగి మెల్లగా కోలుకుని స్పృహలోకి వచ్చాడు అని తెలిపారు.నిపుణులైన యశోదా ఆసుపత్రి వైద్య బృందం సాధిస్తున్న అద్భుతమైన విజయాలకు,యశోదా ఆసుపత్రి అందిస్తున్న అంతర్జాతీయ స్థాయి అత్యాధునికమైన వైద్య సేవలకు ఈ కేసు కూడా మరో చక్కటి ఉదాహరణ.హైదరాబాద్ మలక పేట యశోదా ఆసుపత్రిలో మాత్రమే కాక యశోదా అసుపత్రి అన్ని శాఖల్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, నిపుణులైన యశోదా వైద్య బృందం ద్వారా అత్యంత క్లిష్టతరమైన జబ్బులు,వ్యాధులకు కూడా చికిత్స జరుగుతోందని డైరెక్టర్ గోరుకంటి పవన్,యూనిట్ హెడ్ కె.శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్ చిదుర తెలిపారు.