ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ కు అభినందన
హైదరాబాద్ ఫిబ్రవరి 14 (); పర్యావరణ రక్షణ బాధ్యత ప్రతి ఒక్కరూ అంది పుచ్చుకోవాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ బృందం ఆర్ కృష్ణయ్య ను కలిసి సంస్థ రూపొందించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్ అందజేసింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ …మనిషి నిర్లక్ష్యం, ఉదాసీనత కారణంగా ప్రకృతి సహజ స్థితి కోల్పోయి విపత్తులకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విపత్తులను నిలువరించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఎన్విరాన్మెంట్ సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్… కౌన్సిల్ గౌరవాధ్యక్షులు ఉప్పల వెంకటేష్ గుప్త, వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీ హెచ్ రంగయ్య, సభ్యులు అవినాష్, సీనియర్ పాత్రికేయులు లక్ష్మణ్, టీవీ నటుడు టివి రమణ తదితరులు పాల్గొన్నారు.