మాదిగ హక్కుల దండోరా మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ.
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 14 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కేంద్రంలో మాదిగ హక్కులదండోరా కార్యాలయంలో చలో ఖమ్మం మాదిగ హక్కుల దండోరా మహాసభలను జయప్రదం చేయాలని కోరుకుంటూ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం
కొరిపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది . సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పి మోసం చేసిందని , జరిగిన పార్లమెంటు సమావేశంలో కూడా మాదిగలకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడతామని పిలుపునిచారు . 28 సంవత్సరాలుగా మాదిగలు చేస్తున్న ఉద్యమానికి ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగా మరియు లక్ష్యసాధన కోసం యాతాకుల భాస్కర్ మాది నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు , పోరాటాలు చేసామని గుర్తుచేశారు . ఇకనైనా ఏబిసిడి వర్గీకరణ చేయకపోతే రాబోయే ప్రభుత్వాలకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు . ఈనెల ఖమ్మంలో 27 , 28న జరిగే రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని ఈ సదస్సుకు జాతీయ అధ్యక్షులు దండు సురేంద్ర మాదిగ , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాదాసిదశి భాస్కర్ మాదిగ , స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొంగారి శంకర్ మాదిగ హాజరవుతారని తెలిపారు . మాదిగలు , మాదిగ ఉపకులాలు వేలాదిగా తల్లి రావాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జి కనకపుడి వీర , సామాజిక వైరా నియోజకవర్గ ఇన్చార్జి సక్కుర్తి కోటేశ్వర మాదిగ , పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు గురవయ్య మాదిగ , జరుపుపోతుల నరేష్ మాదిగ , సంజీవరావు మాదిగ తదితరులు పాల్గొన్నారు .