పాత వెజిటేబుల్ మార్కెట్లో కూరగాయలు అమ్మే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి..

 

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపల్ ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ అధికారులు గుర్తించి కూరగాయల మార్కెట్ను పాత అడ్డాలో ఏర్పాటు చేయాలని తూప్రాన్ పట్టణ మహిళలు పరిసర గ్రామ ప్రజలు వారి ఆవేదనను వెలిబుచ్చారు.

తూప్రాన్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ పట్టణానికి అవతల ఏర్పాటు చేయడం పట్టణంలోని మహిళలకు వృద్ధులకు ఇబ్బంది ఉన్నదని మహిళలు తమ ఆవేదనను తెలియజేస్తూ..
ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ పట్టణానికి చాలా దూరంలో ఉన్నందున గృహినీలకు కూరగాయలు సేకరించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అంత దూరం వెళ్లి కూరగాయలు కొనుగోలు చేయడం సంకటక మారిందని అక్కడి వరకు ఆటోలో వెళ్ళాలి అంటే 40 రూపాయల వరకు ఖర్చు అవుతుందని కొన్ని సమయాల్లో సరైన వసతులు లేకపోవడం చిన్నపిల్లలు ఉన్న గృహినీలకు మార్కెట్ కి వెళ్లి రావడం అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఇదివరకు ఉన్న పాత కూరగాయల మార్కెట్లో మాకు కూరగాయలు సేకరించే విధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని మార్కెట్ ను ఏర్పాటు చేయాలని వారి బాధను తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking