చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాందేని చిన్న వెంకటేష్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 09 : చెట్ల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాందేని చిన్న వెంకటేష్ పేర్కొన్నారు. శుక్రవారం ఏడో వార్డ్ లో ఫ్రైడే డ్రై డే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపల్ రమా కళ్యాణి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… స్వచ్ఛదనం పచ్చదనంలో మన చుట్టూ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకొవాలన్నారు. దోమల నివారణ చర్యలో భాగంగా నీరు నిల్వ ప్రదేశాలు, పాత బకెట్లు,కుండలు టైర్లు,కుండీలలాంటి ప్రదేశంలో శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రత విద్యార్థులు చిన్ననాటి నుండే అలవర్చుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ తాటికొండ రాజయ్య, మున్సిపల్ సిబ్బంది వినోద్ కుమార్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.