టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో వెంకటరెడ్డి సంతాప సభ
సీనియర్ జర్నలిస్ట్ వెంకటరెడ్డి మృతికి టీజేఎఫ్ ఘన నివాళి
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 9 (ప్రజాబలం) ఖమ్మం దశాబ్ద కాలంగా జర్నలిస్టుగా పనిచేసిన ఏలేటి వెంకట్ రెడ్డి మృతి చెందడం చాలా బాధాకరమ ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి లు అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్లో శుక్రవారం టియుడబ్ల్యూజే(టీజేఎఫ్) ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన జర్నలిస్ట్ వెంకటరెడ్డి సంతాప సభ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవిలు మాట్లాడుతూ… గత పది సంవత్సరాలుగా వెంకటరెడ్డి టీజేఎఫ్ యూనియన్ లో క్రియాశీలకంగా పనిచేసి యూనియన్ బలోపేతానికి ఎంతో కృషి చేశారని అన్నారు. జర్నలిస్ట్ వెంకటరెడ్డి సేవలు మరువలేనివన్నారు ఇళ్ల స్థలాలు వచ్చే సమయంలో వెంకట్ రెడ్డి మృతి చెందటం బాధాకరమన్నారు జర్నలిస్టు వెంకటరెడ్డి కుటుంబానికి ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్థిక సాయంఇతర సాయాలు అందించేందుకు తమవంతుగా కృషి చేస్తామన్నారు వెంకట్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు విజేత, టీఎస్ చక్రవర్తి, మందుల ఉపేందర్, జానీ పాషా, యలమందల జగదీష్, నరేందర్, ఈశ్వరి, భారతి, కొరకొప్పుల రాంబాబు, కరీష అశోక్, ఉత్కంఠం శ్రీనివాస్, జీవన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి సంతోష్ వెంకట కృష్ణారావు రోసిరెడ్డి నల్లమోతు శ్రీనివాస్ సాయి హుస్సేన్ వెంకటాద్రి ఇసంపల్లి వెంకటేశ్వర్లు అప్పారావు యాదగిరి రవి వెంకటేష్, శ్రీధర్, వెంకటేశ్వర్లు, లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు