ఘనంగా మహేష్ బాబు జన్మదిన వేడుకలు

సూపర్ స్టార్ మహేష్ సేన జిల్లా అధ్యక్షుడు దేవ భక్తుని కిషోర్ బాబు

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 9 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దేవ భక్తుని కిషోర్ బాబు ఆధ్వర్యంలో మహేష్ బాబు జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఆయన మండల కేంద్రాల్లో గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఖమ్మం నగరంలో సూపర్ స్టార్ కృష్ణ ఖమ్మం జిల్లా మరియు నగర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముందుగా పలు దేవాలయాల్లో మహేష్ బాబు పేరు మీద పూజలు చేసి బాబు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుళ్లను వేడుకోవడం జరిగింది. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి రక్తదాన కేంద్రం లో సుమారు 200 మంది యువకులు క్తదానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసిపి గణేష్ మరియు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ విచ్చేసి అభిమానులు ఏర్పాటు చేసిన కేబుల్ కట్ చేసి మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం దాసరి ఫౌండేషన్ అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆశ్రమంలో ఉన్న వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపినారు. అనంతరం జిల్లా గౌరవ అధ్యక్షులు తోట రంగారావు దమయంతి మహిళలకు ఏర్పాటుచేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలు పంపడం జరిగింది ఆడపడుచుల సమక్షంలో మహేష్ బాబు జన్మదిన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది, ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవాభక్తుని కిషోర్ బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 9 తారీకు నాకు పండుగ రోజు ఈరోజు కోసం మేమంతా ఎదురు చూస్తామని జిల్లా వ్యాప్తంగా అభిమానులు అందరు కూడా మహేష్ బాబు పుట్టినరోజుని పండుగ లాగా జరుపుకుంటూ ప్రజలకు ఉపయోగపడే సామాజిక సేవ కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతుందని దీనికి ప్రధానంగా మా ఘట్టమనేని కుటుంబమే కారణమని అన్నారు మహేష్ బాబు ఇప్పటివరకు సుమారు 3500 మంది పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించినారు కానీ ఎక్కడ వారి దానగుణం చెప్పుకోవడం జరగలేదు వారు చేసే దాన ధర్మాల్లో మేము చేసేది చాలా చిన్నదే అయినప్పటికీ వారి బాటలో ప్రయాణిస్తూ ప్రతి సంవత్సరం ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే అనేక రకాల కార్యక్రమాలు జరుపుకుంటూ పోతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బాణాల లక్ష్మణ్ నగర అధ్యక్షులు మునగాల బాలు జిల్లా ఉపాధ్యక్షులు చింతమల్ల గురుమూర్తి, నగర కన్వీనర్ నాగార్జునపు బ్రహ్మం సుధాకర్ , సత్తుపల్లి అధ్యక్షులు కే వెంకటేశ్వర్లు , ఎన్ వెంకన్న వివి కృష్ణ పులిపాటి సంపత్, , ఇరుగు నవీన్ శివ నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking