జిల్లా అదనపు కలెక్టర్ (పౌరసరఫరాలు)సబావత్ మోతిలాల్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 08 : జిల్లా 2023-2024 రబీ సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ముద్దతు వారి చెల్లించి రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని,ఈ క్రమంలో రైతుల సౌకర్యార్థం సనుకుత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా అదనపు కలెక్టర్ (పౌరసరఫరాలు) సబావత్ మోతిలాల్ ఒక ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి నిబంధన మేరకు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని రైతులు కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని తెలిపారు కంట్రోల్ రూమ్ లో రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నుండి వచ్చే ఫిర్యాదులను రిజిస్ట్రర్ నమోదు చేయండి జరుగుతుందని,జిల్లా పౌరసరఫరాల శాఖ జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్, జిల్లా సహకార శాఖ,జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ,రైస్ మిల్లర్ల సమన్వయంతో ఫిర్యాదులను రక్షించడం జరుగుతుందని,రైస్ మిల్లర్లు తమ మిల్లర్ల వద్ద కంట్రోల్ రూమ్ వివరాలను సంప్రదించాలని తెలిపారు. కంట్రోల్ రూమ్ ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుందని ఫిర్యాదులు వివరాల కొరకు కంట్రోల్ రూమ్ నెంబర్ 6303928682 సంప్రదించాలని తెలిపారు.