మంచిర్యాల మాతా శిశు ఆసుపత్రి నిర్మాణంకు అడుగు ముందుకు పడ్డాయి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 08 : మంచిర్యాల ఐబీ స్థలంలో మాతా,శిశు ఆసుపత్రి నిర్మాణంకు అడుగులు ముందుకు పడ్డాయి అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు.గోదావరి తీరాన మాతా శిశు ఆసుపత్రి అనువుగా లేకపోవడం,గోదావరి బ్యాక్ వాటర్ తో వర్షాకాలంలో మునిగి పోవడంతో ఐబీ స్థలంలో మాతా,శిశు ఆసుపత్రి నిర్మించాలని శాసనసభ సభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సంకల్పించారు. అనుకున్నట్లుగానే సోమవారం SSIPCPL సీనియర్ ఇంజినీర్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం సర్వే కోసం మంచిర్యాల కు వచ్చి ప్రేమ్ సాగర్ రావును కలువగా ఆయనతో పాటు అధికారులు ఐబీ స్థలంకు చేరుకున్నారు.నవీన పద్ధతుల్లో భావి తరాలకు అనువుగా సకల సౌకర్యాలతో కూడిన మాతా శిశు ఆసుపత్రి భవనం నిర్మించాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆదేశించారు. ఆర్డీఓ,రహదారులు, భవనాలు శాఖ,గెస్ట్ హౌస్ మరోచోటుకు తరలించి ఆభవనాలు ఆసుపత్రి నిర్మాణంకు స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మాజీ ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు,అప్పటి అధికారులు అనాలోచిత నిర్ణయం తో ఐబీ స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణం చేపట్టారు. ప్రేమ్ సాగర్ రావు ఎన్నికల ముందే తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మార్కెట్ నిర్మాణ దశలో ఉన్న వాటిని కూల్చివేసి ఆ స్థలంలో మాత, శిశు ఆసుపత్రిని నిర్మిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.ఇచ్చిన విధంగానే మార్కెట్ నిర్మాణంలో భవనాన్ని కూల్చి వేసి ఆస్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రేమ్ సాగర్ రావు కృషి ఫలితంగా బాలింతలు, గర్భిణీ స్త్రీల సమస్యకు తెరపడనుంది.