ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 9 :
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ, కుల సర్వే శనివారం మందమర్రి పట్టణంలో ప్రారంభించారు. ఈసందర్భంగా మందమర్రి మున్సిపల్ కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు పట్టణంలోని వివిధ వార్డులలో పర్యటించి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేస్తున్న పత్రాలను పరీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందమర్రి పట్టణంలోని ప్రతి ఇంటికి మున్సిపాలిటీ తరపున ఎన్యుమరేటర్లు వచ్చి సర్వే నిర్వహిస్తారని తెలిపారు. పట్టణ ప్రజలు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ధరణి పాస్ బుక్కులు ఇతర దస్తావేజులు అందుబాటులో ఉంచుకోవాలని కోరారు.
అయితే వివరాల సేకరణలో భాగంగా కొన్ని పత్రాలు ఉంచుకుంటే వేగంగా సమాచారం సేకరణ త్వరగా పూర్తవుతుందని ముఖ్యంగా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పట్టాదారు పాసు బుక్కుల వంటివి అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. తీరా ఎన్యూమరేటర్లు వచ్చే సమయానికి ఇబ్బందిపడకుండా ముందుగానే ఈ కాగితాలను సిద్ధం చేసుకుంటే వివరాలను కూడా సులభంగా చెప్పొచ్చన్నారు. ఇక మొత్తం వివరాలు పూర్తయ్యాక తాను చెప్పిన వివరాలన్నీ నిజమేనని ప్రకటిస్తున్నట్లుగా కుటుంబ యజమాని సంతకం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.