మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు రాధకా గుప్తా
ప్రజబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నవంబర్ 9:
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా దమ్మాయిగూడ, పోచారం మండలాలలో ఎన్యుమరేటర్లు నిర్వహిస్తున్న కుటుంబాల వివరాల సేకరణ ప్రక్రియను శనివారం మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు రాధకా గుప్తా పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టరు రాధిక గుప్తా మాట్లాడుతూ సర్వే ను జాగ్రత్తగా ఎలాంటి లోపాలు జరుగకుండా నిర్వహించాలని సూచించారు. వివరాలను సేకరించేటప్పుడు కుటుంబయజమానులు వారి వారి ఆధార్, ఓటర్, అవసరమైన కార్డులను చూసి నివేదికలను నింపాలని ఎన్యుమరేటర్లకు సూచించారు. సర్వేకు సంబంధించిన ప్రొఫార్మలను పరిశీలించి ఏ విధంగా నమోదు చేస్తున్నారని, కుటుంబ సభ్యులను ఏమేమి ప్రశ్నలు అడుగుతున్నారని ఎన్యుమరేటర్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రొఫార్మాలు పూరించేందుకు కోడింగ్ ను ఉపయోగించాలని రాధికా గుప్తా ఎన్యుమరేటర్ లకు సూచించారు.