పీఎఫ్ ఉన్నా బీడీ కార్మికులకు జీవనభృతి ఇవ్వాలి

 

బీడీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

కలెక్టరేట్ ఎదుట తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్

జగిత్యాల ప్రతినిధి, జూన్ 12(ప్రజా బలం) రాష్ట్రంలో బీడీ పరిశ్రమ సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జీవన భృతిలో పీఎఫ్ నిబంధన లేకుండా అందరికీ జీవనభృతి అందించాలని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు సామల మల్లేశం డిమాండ్ చేశారు. సోమవారం ఏఐటియుసి ఆధ్వర్యంలో బీడీ కార్మికుల సమస్యలపై స్థానిక రామాలయం నుంచి ర్యాలీగా వెళ్లిన బీడీ కార్మికులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి, ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు సామల మల్లేశం లు మద్దతు తెలిపారు. అనంతరం చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం దేశంలోని లక్షలాది బీడీ కార్మికుల పొట్ట కొట్టే పనులను చేపట్టిందన్నారు. కుటీర ప్రరిశ్రమగా వర్ధిల్లుతున్న బీడీ పరిశ్రమ పై 28 శాతం జిఎస్టీని విధించి బీడీ పరిశ్రమ ఖాయిల పడేలా చేసిందన్నారు. తక్షణమే కేంద్రం కుటీర పరిశ్రమగా బీడీ పరిశ్రమను గుర్తించి జిఎస్టీని ఎత్తివేయాలని కోరారు. అలాగే జగిత్యాల జిల్లాలో బీడీ కార్మికులు అత్యధికంగా ఉన్నారని వీరి సంక్షేమానికై ఈఎస్ఇ ఆసుపత్రిని నిర్మించాలని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ముక్రం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2014 కటాఫ్ ను ఎత్తివేసి పీఎఫ్ ఉన్నా బిడికార్మికులకు జీవనభృతి ఇస్తామని హామీఇచ్చారు. ఏడేండ్లు గడుస్తున్నా హామీ నెరవేరలేదన్నారు. గృహలక్ష్మీ పతకం క్రింద స్వంత జాగా కలిగిన బీడీ కార్మికులందరికి మూడు లక్షల ఆర్థిక సహాయాన్ని ఐదు లక్షలకు పెంచాలని ముక్రం కొరారు. కేంద్ర పీఎఫ్ సంస్థ నుంచి రాజీనామా చేసిన బీడీ కార్మికులకు ఆరు వేల రూపాయల కనీస పెన్షన్ ఇవ్వాలన్నారు. సత్వరమే బీడీ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ముక్రం కోరారు. ఈ కార్యక్రమంలో బీడీ వర్కర్స్ రాష్ట్ర నాయకులు సూతారి రాములు, కొక్కుల శాంత, ఇరుగురాల భూమేశ్వర్, కిరణ్, అథిక్, ధర్మయ్య, రాజగంగు, అక్రమ్, శ్రీను, అందే రామయ్య, మహేష్, బీడీ టేకెదారుల సంఘం నాయకులు వెంకన్న, వెన్న సురేష్, చెన్న విశ్వానాతం తో పాటు వందలాదిగా బీడీ కార్మికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking