అనదికార నిర్మానాలతో అక్రమ వ్యాపారం

మున్సిపల్ ను మరియు కస్టమర్లను ని మోసం చేస్తున్న వైనం
చర్యలకు శివసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏ.సుదర్శన్ డిమాండ్
హైదరాబాద్ జూన్ 12 :అంబర్పేట్ శివమ్ రోడ్ ప్రశాంత్ నగర్ 2-2-2/బి మరియు 2-2-3/3/8/A ఇంటినెంబర్ లో అక్రమ నిర్మాణం చేస్తూ మున్సిపల్ ను మరియు కస్టమర్లను ని మోసం చేస్తూ అనధికారికంగా ఫ్లాట్స్ కడుతూ ప్రజలకు గుడ్డిగా అమ్ముతున్నారని శివసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏ.సుదర్శన్ ఆరోపించారు. సర్కిల్ 16 ఏసీపీ సాయిబాబా ఏరియాలో బిల్డింగ్ ఉన్నది జిహెచ్ఎంసి నుంచి ఓసి తీసుకొని మరియు అనధికారికంగా కడుతూ ఇతరులకు అమ్ముతున్నాడని ఆయన పేర్కొన్నారు.దీనిపై వెంటనే చర్య తీసుకోవాలని జిహెచ్ఎంసి అధికారులను డిమాండ్ చేసారు. అదనంగా ఒక ఫ్లోర్ వేసి ఇతరులకు అమ్ముతున్న బిల్డింగ్ ఓనర్ గురు మూర్తి పై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని హెచ్ ఎం సి అధికారులను కోరారు. ఓసి ను వెంటనే రద్దు చేయాలి ఈ బిల్డింగ్ ఓనర్ పై చర్యలు తీసుకోవాలని సుదర్శన్ డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking