రాష్ట్ర అటవీ దేవాదాయ ,ధర్మాదాయ ,పర్యావరణ శాఖ
మంత్రి కొండా సురేఖ
మెదక్ ఎంపీ
రఘునందన్ రావు
మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు
ప్రజాబలం దినపత్రిక
మెదక్ జిల్లా నియోజకవర్గం
26.09.2024:
గురువారం మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ వనమహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములను చేయాలని కోరారు.పచ్చటి మొక్కలతోనే భవిష్యత్తు తరాలకు భరోసా వస్తుందన్నారు.
వనాలు పెంచే ఉద్దేశంతో సమూహంగా అధిక సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వనమహోత్సవం అంటారని తెలిపారు మానవుని మనుగడకు అవసరమైన వాటిలో అతి ముఖ్యమైనవి చెట్లు, చెట్ల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పెంచేలా ప్రోత్సహిస్తూ ఈ వనమహోత్సవాన్ని
చేపడతారన్నారు.
ఈ కార్యక్రమం లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు,మెదక్ ఎంఎల్ఏ రోహిత్ రావు,నర్సాపూర్ ఎంఎల్ఏ సునీత లక్ష్మారెడ్డి,ఎంఎల్ సి షేరి సుభాష్ రెడ్డి, ఎంఎల్ సి యాదవరెడ్డి,ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ,కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు, డిఎఫ్ఓ జోజి ప్రజా ప్రతినిధులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.