తెలంగాణ చరిత్ర అంటేనే – త్యాగ ధనుల చరిత్ర

 

అటవీదేవాదాయ ,ధర్మాదాయ ,
పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

ప్రజాబలం దినపత్రిక
మెదక్ జిల్లా నియోజకవర్గం
26.09.2024:

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని మంత్రి కొండా సురేఖ అన్నారు.
చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయం లో ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
.ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర మొత్తం త్యాగధనుల అమరత్వమేనని, ఆ మహనీయుల ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రశ్నించేతత్వం అలవడిందన్నారు. నిజాం నిరంకుశ పాలనలో శిథిలమైపోయిన బతుకులను బాగు చేయడానికి వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా దొరలు, జమిందారుల చేతుల్లో బానిసలుగా మగ్గుతున్న బహుజనులకు స్ఫూర్తినిస్తూ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు.
ఆనాడు బహుజనుల కోసం పోరాటం చేసిన ఆ మహనీయుల స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు పంచాలనే సంకల్పంతో వీరనారి సబ్బండ వర్గాల ప్రతినిధన్నారు.
ఆమె స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలనే సంకల్పంతో కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరుని పెట్టి ఆ వీరనారికి గుర్తింపునిచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ రెడ్డి స్ఫూర్తితో సబ్బండ, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడుతూ వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు,మెదక్ ఎంఎల్ఏ రోహిత్ రావు,నర్సాపూర్ ఎంఎల్ఏ సునీత లక్ష్మారెడ్డి,ఎంఎల్ సి షేరి సుభాష్ రెడ్డి, ఎంఎల్ సి యాదవరెడ్డి,ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ,కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు, ప్రజా ప్రతినిధులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking