మహిళల రక్షణ కోసం ప్రతి ఒక్క మాహిల పోరాటం చేయాలి

హేల్ టాటా మణీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మెర్సీ జ్యోతీ
రాజమండ్రి 6 ();రాజమండ్రి లోని నాటక రంగం, పాటల రంగం సంస్థ ఆద్వర్యం లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హేల్ టాటా మణీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మెర్సీ జ్యోతీ మాట్లాడుతూ నేడు సమాజం లో స్త్రీ లకు రక్షణ లేకుండా పోయిందని మహిళల రక్షణ కోసం వారి హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్క మాహిల పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు.లేనియడల మనం ఎన్ని మహిళా దినోత్సవాలు జరుపుకున్న వ్యర్దామీ నన్నారు.పోరాటాల ద్వారానే మన హక్కులను కాపాడు కోవాలన్నారు. ఇలాంటి ప్రోగ్రాం ను స్ర్తీల ఎదుగుదలకు ఉపయోగకరం గా ఉండటానికి దోహద పడగవన్నారు. అందరం కలిసి ఆకలి అనే అడ్డు గోడలను కూల్చుదామన్నారు. ఈ సందర్బంగా నాటక రంగం సంస్థ అద్యక్షులు యువి రత్నం మెర్సీ జ్యోతి ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో జగదాంబ , కల్పన రెడ్డి , ప్రియాంక నిస్సీ , లక్ష్మీ , మోర సత్యనారాయణ కాకుమాను ప్రవీణ్ కుమార్ ,పోలంకి ఉష రాణి, పాలంకి జగదీశ్ కుమార్,ఎస్ కే ప్రవీణ్ ,సునీతా రెడ్డి తదితరులుయ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking