ఎన్నికల సంఘం నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలి నిర్మల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నియోజకవర్గాల వారీగా ఎన్నికల విధులపై ఎలక్షన్ మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి అధికారి అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్ కు ముందు, పోలింగ్ సందర్భంగా, పోలింగ్ తర్వాత ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు నిర్వర్తించవలిసిన విధులు, బాధ్యతలను ఆయన వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రం లో సిసి కెమెరా లు ఏర్పాటు చేయాలని, పోలింగ్ రోజున ఉదయం రాజకీయ పార్టీల ఏజెంట్ ల సమక్షం లో మాక్ పోల్ నిర్వహించాలన్నారు. ఈవియం, వివిప్యాట్, కంట్రోల్ యూనిట్ లలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత సెక్టోరల్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. పోలింగ్ సమయం ముగిసేలోపు క్యూ లైన్ లలో ఉన్న ఓటర్లకు టోకెన్లు అందజేయాలని సూచించారు. ఓటర్ స్లిప్ తో పాటు ఆధార్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి 11 రకాల గుర్తింపు కార్డులను చూపించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ప్రతీ రెండు గంటలకు పోలింగ్ కు సంబంధించి రిపోర్టులను విధిగా అందజేయాలని సూచించారు. పోలింగ్ ముగిసిన తర్వాత రిసీవింగ్ కౌంటర్లో అధికారులు కమిషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని, నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం ఈవీఎంల ను కనెక్ట్ చేయడం, ఈవీఎం, మాక్ పోల్ నిర్వహణ, ఈవీఎంలు సీల్ చేయడం, ప్రత్యేక సందర్భాలు, ఛాలెంజిడ్ ఓట్లు, టెండర్ ఓట్లు, నిబంధన-49 ఎం, 49 ఎంఏ, 49 ఓ, ఏఎస్డీ ఓటర్లు వంటి అంశాలపై మాస్టర్ ట్రైనర్లు బి.శ్రీనివాస్, ఏ. శ్రీనివాస్ రెడ్డి, ఏ. వేణుగోపాలరావ్, పి.నారాయణ వర్మ అధికారులకు శిక్షణ, అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, శిక్షణ నోడల్ అధికారి, డి.ఈ.ఓ రవీందర్ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking