ఖమ్మం ప్రతినిధి మార్చి 27 (ప్రజాబలం) ఖమ్మం నేను ఇక్కడి బిడ్డను ఖమ్మం జిల్లా సమస్యలు తెలిసిన వాడిని, ఇక్కడి మట్టి విలువ నాకు తెలుసు. సాధకబాధకాలు బాగా తెలుసు మేధావులతో విద్యావంతులతో అనుభవజ్ఞులతో చర్చించి ఖమ్మం జిల్లా సమస్యల గురించి ఓ అభివృద్ధి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వేలకోట్ల నిధులు పంపించింది. వాటిని ఇక్కడి ప్రభుత్వాలు తాము చేసిన డెవలప్మెంట్ గా ప్రచారం చేసుకుంటున్నాయి ఖమ్మం జిల్లా అభివృద్ధికి 12 వేల కోట్ల రూపాయలు కేంద్రం నిధులు అందించింది ఖమ్మం చుట్టూ నేషనల్ హై వేస్ భరతమాత హారాన్ని తలపిస్తాయి వందల కోట్ల రూపాయలు వెచ్చించి కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ లు అభివృద్ధి చేసింది ఖమ్మం జిల్లాలో ఉన్న యువత కోసం ఉపాధి అవకాశాలు కల్పించడం మా అజెండాలో ముఖ్యమైనది. మన పిల్లలు చిన్న చిన్న జీతాల కోసం వలస పోవడం బాధాకరం అన్నారు
సేంద్రియ వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహిస్తాం
కొత్తగూడెం ఎయిర్పోర్ట్ గురించి ఎప్పటినుండో వింటున్నాం, సాకారం చేస్తాం అయోధ్య నుండి భద్రాచలం వరకు ఆథ్యాత్మిక కారిడార్ తీసుకుని వస్తాను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి రావడం ఖాయం మన ఖమ్మం లో కమ్యూనిస్ట్ లకు, కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ లకు అవకాశం ఇచ్చారు. ఈ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. నా 30 ఏళ్ల అనుభవంతో అభివృద్ధి చేసి చూపుతా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం, పార్టీ కోసం ప్రాణాలర్పించిన సాయి గణేష్ కుటుంబానికి అండగా ఉంటాం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా నాకు అవకాశం ఇస్తే ఖమ్మం జిల్లా ప్రాంతం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని అన్నారు

గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ
తాండ్ర వినోద్ రావు తెల్లకాగితం లాంటి స్వచ్ఛమైన వ్యక్తి. వారిని అభ్యర్థిగా ప్రకటించడంతో పార్టీలో కొత్త ఉత్సాహం పెల్లుబికుతోంది నిన్న ఆయన భారీ ర్యాలీలో – బీజేపీ లో ప్రతి ఒక్కరూ అభ్యర్థి అని మాట్లాడిన మాట ప్రతి కార్యకర్త మదిలో కలకాలం ఉంటుంది నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ 400 స్థానాలు గెలుస్తున్నం, అందులో ఖమ్మం సీట్ కూడా ఉంది గత ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ విస్మరించింది, ప్రతిపక్ష పార్టీల నాయకులను ఇబ్బందులకు గురి చేసింది కాంగ్రెస్ కూడా ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేస్తామని ఇంతవరకు అమలు చేయలేదుపార్లమెంట్ సీట్ కోసం చాలా మంది ప్రయత్నం చేసిన ఆ అవకాశం తాండ్ర వినోద్
రావు కు దక్కింది అంతా కలిసి పని చేసి తాండ్ర వినోద్ రావు ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం టీడీపీ, జనసేన పార్టీలో ఎన్డీఏ లో భాగమే కాబట్టి వారి పూర్తి మద్దతు మాకే ఉంటుంది అన్నారు
భారీ చేరికలు
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తెల్ల దారుపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ చెందిన పలు కుటుంబాలు తాండ్ర వినోద్ రావు సమక్షంలో బిజెపి పార్టీలో చేరాయి వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు