వినతి పత్రం అందించిన బిఆర్ఎస్వి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 27:
టెట్ అర్హత ఫీజు తగ్గించాలని కోరుతూ బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో టెట్ సూపరింటెండెంట్ నాగరాజు కి వినతి పత్రం సమర్పించినట్లు బిఆర్ఎస్వి నేతలు తెలిపారు తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య మాట్లాడుతూ గతంలో టెట్ ఒక పేపర్‌కు రూ.200 ఫీజు ఉండగా దాన్ని రూ.1000కి పెంచారని, రెండు పేపర్లు రాసే అభ్యర్థులకు గతంలో రూ.300గా ఉన్న ఫీజును ఏకంగా రూ.2,000కు వరకు పెంచారని తెలిపారు. ఫీజులను ఈ స్థాయిలో పెంచడం నిరుద్యోగులకు అన్యాయం చేసినట్టేనని అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కోచింగ్, శిక్షణ,హాస్టల్ ఫీజులకే వేలకు వేల రూపాయలు ఖర్చుపెడుతున్న అభ్యర్థులకు ఇది భారం కానుందని వాపోయారు. దేశంలో ఎక్కడ లేని విధంగా టెట్‌కి ఒక్కో పేపర్‌కి వెయ్యి రూపాయల ఫీజు చెల్లించాలి అనడం నిరుద్యోగుల మీద భారం వేయడమే అన్నారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయమని చెప్పి ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. ఆన్ లైన్ పరీక్ష పేరిట వేలకు వేల రూపాయలు వసూలు చేయటం సరికాదని, వెంటనే టెట్ ఫీజు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు నాగేందర్, అవినాష్,శ్రీకాంత్,రాకేష్,క్రాంతి, జాన్,వంశీ తదితరులు పాల్గొన్నారు.