జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల ఆకస్మిక తనిఖీలు

 

అర్హతలేని క్లినిక్ ల సీజ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 27:
తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ విజిలెన్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్సి చేసిన ఫార్సుల ఆధారంగా, ఈరోజు 27-03-2024న, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి,డాక్టర్ టి. రఘునాథస్వామి మరియు
కీసర డివిజన్ డిప్యూటీ జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డాక్టర్
ఎన్. నారాయణరావు ప్రోగ్రామ్ అధికారిణి గీత ప్రసాద్
వారి బృందం తో కలసి నమోదుకాని పాలీ క్లినిక్‌లు మరియు ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు,

– M/s శ్రీ మణికంఠ హెల్త్ కేర్ & పాలీ క్లినిక్, ఉప్పల్
– M/s శ్రీ రాజు ఫస్ట్ ఎయిడ్ క్లినిక్, చిలకనగర్

తనిఖీల్లో భాగంగా క్లినీలల్లో దొరికిన వైద్య పరికరాల ఆధారంగా (సర్జికల్ కుట్టు సూదులు, సర్జికల్ కత్తెరలు, అన్ని పరిమాణాల మెడికల్ కట్టింగ్ షియర్స్, ENT ప్రొసీడ్యూరల్ మెటీరియల్స్, ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్‌లు, బి-టైప్ (10 లీటర్లు) ఆక్సిజన్ సిలిండర్, సర్జికల్ పిన్స్ డిస్టాప్లర్ వంటివి) ఆధారంగా ఇది రుజువైంది.
యాజమాన్యం అర్హత కలిగిన వైద్యులు మరియు సిబ్బంది లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఆసుపత్రిని నడుపుతోంది, ఇది ప్రజలకు మరియు ముఖ్యంగా అమాయక ప్రజలకు నష్టం కలిగిస్తుంది అని తెలిపారు, ఈ క్లినిక్‌లు చట్టవిరుద్ధంగా అర్హత కలిగిన వైద్యులచే నమోదు లేకుండా చిన్న శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నాయి, అనుమతి లేకుండా వైద్య నిపుణులుగా ప్రాక్టీస్ చేసి ప్రచారం చేసుకుంటున్నారని కూడా గమనించారు, దీంతో డీఎంహెచ్‌ఓ, బృందం పోలీసు, రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో ప్రజారోగ్యానికి శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని పై క్లినిక్లను సీజ్ చేయడం జరిగింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లో నిబంధనలు ఉల్లంఘించిన ఏ ఆసుపత్రిగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

అలాగే సరిఅయిన దస్తావేజులు లేని M/s మహాలక్ష్మి క్లినిక్, చిలకనగర్
క్లినిక్ తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్స్ & రెగ్యులేషన్) యాక్ట్ 2010 (కేంద్ర చట్టం No 23 of 2010) & రూల్స్ 2022 నోటీసు జారీ చేయబడింది,

యి కార్యక్రమంలో డాక్టర్ సౌందర్య లత,
వైద్యాధికారి, పీహెచ్‌సీ ఉప్పల్, అంజన్న డెమో , శ్రీ బి ప్రకాష్, MPHS(m)
శ్రీ పి శ్రీనివాస్, MPHA(m) తనిఖీలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking