రైతుల పొట్టకొట్టిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు,బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి

 

NH63 అలైన్ మెంట్ మార్పు చేసిన పాపం బీఆర్ఎస్,బీజేపీ నాయకులదే

కాంగ్రెస్ నాయకులు సూరం చంద్రమౌళి

నేషనల్ హైవేను పాత అలైన్ మెంట్ మార్చి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు,బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావులు రైతుల నోట్లో మట్టికొట్టారని కాంగ్రెస్ నాయకులు సూరం చంద్రమౌళి ఆరోపించారు. లక్షెట్టిపేట NH63 గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారి మొదటి ప్లాన్, రెండవ ప్లాన్ కాకుండా మూడవ ప్లాన్ గా మార్పు చెందడానికి బీజేపీ,బీఆర్ఎస్ నాయకులే కారణమన్నారు. ఒకసారి ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన వారి పొట్టలు మళ్ళీ కొట్టేలా,మళ్ళీ వాళ్ళ భూములను లాక్కునేల చేసింది మంచిర్యాల నియోజక వర్గ బీఆర్ఎస్,బీజేపీ నాయకులేనన్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై,వారికీ అనుగుణంగా మెయిన్ రోడ్ నుండి వచ్చిన రెండవ ప్లాన్ కాకుండా మార్పు చేయడానికి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి మార్పు కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మకై, రాష్ట్రంలో,దేశంలో పెద్ద నాయకులందరని కలిసి మూడవ ప్లాన్ గా మార్చి,పేద రైతుల పొట్ట కొట్టారని మండిపడ్డారు. బీఆర్ఎస్,బీజేపీ నాయకులు తోడు దొంగల్లా మారి ఒకసారి భూములు కోల్పోయిన రైతుల నుండే మళ్ళీ లాక్కునేలా చేసి రైతుల నోట్లో ప్రత్యక్షంగా మట్టి కొట్టారని వాపోయారు.గడిచిన కొన్ని సంవత్సరలాలో అటు దివాకర్ రావు కానీ,ఇటు రఘునాథ్ రావు కానీ పేద ప్రజలకి, నియోజక వర్గ ప్రజల అభివృద్ధి కి చేసింది శూన్య మేనన్నారు.ప్రజలు ఈ విషయాన్ని గమనించి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులని తరిమికొట్టాలన్నారు.బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకి చిత్త శుద్ది ఉంటే చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. భూములు కోల్పోయిన రైతులకు సరైన న్యాయం అందించాలని అయన డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking