మున్సిపల్ కమిషనర్ కల్లేడ రాజశేఖర్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 27 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని వర్తక వాణిజ్య వ్యాపారస్తుల ను పిలిచి ప్లాస్టిక్ నిషేధం పై సమావేశం నిర్ణయించడం జరిగినది. బుధవారం ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పట్టణములో ప్లాస్టిక్ వాడకం నిషేధించడం అయినదని తెలియ చేసి,ప్లాస్టిక్ వాడినట్లు అయితే జరిమానా విధించి తెలంగాణ.నూతన మున్సిపల్ చట్టం 2019 ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని హెచ్చరించడం జరిగినది.ఈ సమావేశములో శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఎమ్ ఏ అజీమ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కట్ల రాకేష్ పాల్గొన్నారు.