హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి మే 22: భాగ్యరెడ్డి వర్మ స్పూర్తిని ప్రతిఒక్కరూ ఆచరించాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. స్వర్గీయ భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతిని పురస్కరించుకొని గురువారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎనలేని సేవలు చేశారని, బాలికల విద్య కోసం పాఠశాలలు నెలకొల్పిన మహనీయుడు అని అన్నారు. ఆయన బాల్య వివాహాలు అరికట్టడం, బాలికల విద్య, మద్యనిషేధం లాంటి అనేక కార్యక్రమాల పై ప్రజలను చైతన్యవంతం చేశారని, ఆయన సేవలు ప్రజలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.
?ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవ్ రావు, అడిషనల్ కమిషనర్ లు వేణు గోపాల్, గీతా రాధిక, యాదగిరి రావు, అడిషనల్ సిసిపి వెంకన్న, అకౌంట్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, సిపిఆర్‌ఓ మహమ్మద్ మూర్తుజా తదితరులు పాల్గొన్నారు.