ఎల్బీనగర్ ప్రజాబలం ప్రతినిధి:, మే 22:ఎల్ బి నగర్ జోన్ లో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్ ఆర్ వి కర్ణన్ ఈ సందర్భంగా ఎల్బీనగర్ జోన్ లోని సరూర్ నగర్ సర్కిల్ లో పలు ప్రాంతాలలో పలు పనులు కమీషనర్ పరిశీలించారు.
కమీషనర్ వెంకటేశ్వర్ కాలనీ కి వెళ్లగా ఆ కాలనీకి చెందిన రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కమిషనర్ ను కలిసి కాలనీ కి సంబంధించి సమస్యలను వివరించగా వెంటనే పరిష్కరించాలని జోనల్, డిప్యూటీ కమిషనర్ లను ఆదేశించారు. గడ్డిఅన్నారం డివిజన్ లో బాక్స్ డ్రెయిన్ పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వల్లభ్ నగర్ లో వాటర్ లాగింగ్ పాయింట్ ను కమిషనర్ పరిశీలించారు.
కమీషనర్ వెంట జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్.ఈ అశోక్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.