నాంపల్లి గాంధీభవన్ ప్రజాబలం ప్రతినిధి:పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై న్యాయస్థానం తీర్పు తమకు అనుకూలంగా ఇచ్చినట్లు, తామంతా నీతిమంతులైనట్లు చెప్పేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు
నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి ఈ పథకంపై కోర్టులో కేసు వేశారు
ఆయన పూర్తి ఆధారాలతో ఆ రోజు న్యాయస్థానంలో కేసు వేశారు
ఆయనను బీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకుని ఆ కేసును నీరుగార్చేట్లు, వీగిపోయేట్లు వ్యవహరించారు
మీ పార్టీలో ఉన్న నాయకుడు మీ పార్టీ అధినేత కేసీఆర్‌పై ఎలా కొట్లాడతారు
దీంతో తామంతా నీతిమంతులమని, చేసిన అవినీతి మాయమైనట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారు
దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి…..ఏ విచారణ కావాలో అడగండి
ధైర్యం ఉంటే…సీఐడీ విచారణ కావాలా…జుడిషియల్ విచారణ కావాలా అన్నది ప్రభుత్వానికి రాయండి
అప్పుడు అవినీతి ఏవిధంగా జరిగిందో బట్టబయలవుతుంది
నిజాయతీని నిరూపించుకునేందుకు కేటీఆర్ ముందుకు రావాలి