కంటి వెలుగును అందరు సద్వినియోగం చేసుకోవాలి

 

నయనం ప్రధానమని గుర్తించండి

__కంటి వెలుగును ప్రారంభించిన ఎస్పీ భాస్కర్

జగిత్యాల, మార్చి 10,(ప్రజాబలం ప్రతినిధి) నయనం ప్రధానమని ప్రతిఒక్కరు గుర్తించాలని ప్రభుత్వం అమలుచేస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో పోలీసులు అధికారులు, ప్రజలు పరీక్షలు చేయించుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ కోరారు.
శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ భాస్కర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు ప్రారంభంచిదని అన్నారు. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పటు చేయడం జరిగింది అని నేటి నుండి రెండురోజుల పాటు నిర్వహిస్తారన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. మనకున్న అన్ని అవయవాల్లో కన్న కళ్ళు అత్యంత ప్రాధాన్యతమైనవని అలాంటి కళ్ళకు ఏదైనా సమస్య వస్తే నిర్లక్ష్యం చేయరాదని వైద్యులకు చూపించుకోవాలని సూచించారు. ఈ కంటి సమస్యలపై చాలామంది నిర్లక్ష్యంతో వ్యవహరిస్తారని ఈ సమస్యను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి సమాజంలోని ప్రజలకు కంటి సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ముఖ్యంగా వాహనాలు నడిపే వారు, నలభై సంవత్సరాల పైబడిన వారు తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నిరంతరం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల వ్యక్తిగత శ్రద్ధ అవసరమని ముఖ్యంగా కంటి సమస్యల పట్ల అశ్రద్ధ వహించవద్దని, ముఖ్యంగా సిబ్బంది, వారి కుటుంబాల్లో కంటి సమస్యలు బాధపడుతున్న కుటుంబ సభ్యులకు కంటి వెలుగు కార్యక్రమము ద్వారా పరీక్షలు నిర్వహించుకోవాలని ఎస్పీ సిబ్బందికి పిలుపునిచ్చారు.


ఈ కంటి వెలుగు కార్యక్రమానికి సహకరించిన జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి మిగతా వైద్యులకు పోలీస్ శాఖ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో డీఎస్పీలు ప్రకాష్, రవీంధ్ర కుమార్, జిల్లా వైద్యాధికారి శ్రీధర్, కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఎస్బి, డీసీఆర్బీ, ఐ టి కోర్ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్ రాజు, మల్లయ్య, సరిలాల్ , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వామనమూర్తి, నవీన్ పాటు ఇతర పోలీస్, వైద్య సిబ్బంది పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking