ఖమ్మం ప్రతినిధి మార్చి 10 (ప్రజాబలం) ఖమ్మం రూరల్ ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం రూరల్ మండలంలో శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా వరంగల్ క్రాస్ రోడ్ మారుతినగర్ కాలనీకి చెందిన చిదుముల అనంతరెడ్డి కుమారుని వివాహం ఇటీవల అయినందున నూతన దంపతులను దీవించారు. నిండునూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. పట్టువస్త్రాలను కానుకగా అందించారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కార్పొరేటర్ మలీదు జగన్, అజ్మీరా అశోక్ నాయక్, సుదగాని ఉపేందర్, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గునగంటి రమేష్, ప్రవీణ్, వెంపటి రవి, యువనేత గోపి, చల్లగుండ్ల సురేష్, జాన్ పాషా (గన్) తదితరులు ఉన్నారు.