కరోనా కార్టూన్ల పుస్తకాన్ని ఆవిష్కరించిన ఖజానా శాఖ రాష్ట్ర సంచాలకులు మూర్తి

 

-అధ్బుత కార్టూన్ గీసిన ఖజానా డిడి వెంటపల్లి సత్యనారయణ

ఖమ్మం ప్రతినిధి మార్చి 10 (ప్రజాబలం) ఖమ్మం ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ పై ఖమ్మం జిల్లా ఖజానా ఉపసంచాలకులు వెంటపల్లి సత్యనారాయణ గీసిన కరోనా కార్టూన్ల పుస్తకాన్ని ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ రాష్ట్ర సంచాలకులు కేయస్ ఆర్ సి మూర్తి ఆవిష్కరించారు. ప్రపంచాన్ని గడ గడ లాడించి మానవుల జీవితాలను ఎన్నో కుటుంబాలను అతలాకుతలం చేసింది. ఆలాంటి కరోనా వైరస్ తో మానవజాతి ఎలా ఉండాలి ఎలా జీవించాలి ఎలా ఎదుర్కొనాలి అనే విషయాలను కళ్ళకు కట్టినట్లు ఖజానా శాఖ డిడి వెంటపల్లి సత్యనారాయణ చిత్రలేఖనం ద్వారా సుమారుగా వంద

మానవాళిని సజీవంగా వుండే కార్టూన్లు ఎంతోమంది మన్నలను పొంది అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ కార్టున్లను అన్నిటిని తీసుకవచ్చి డైరెక్టరేట్ లోని రాష్ట్ర సంచాకులు చే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో అడిషనల్ డైరెక్టర్ యాస్మిన్ సుల్తానా జాయింట్ డైరెక్టర్ ప్రవీణ ప్రభ డిప్యూటీ డైరెక్టర్ సురేష్ బాబు సంఘం ప్రధాన కార్యదర్శి పరుశురాం అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు ఖమ్మం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మోదుగు వేలాద్రి ఏటివో విజయకుమార్ ముర్తుజా హుసేన్ రవీంద్ర బాబు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking