ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. డిసెంబర్ 7, 1987న జరిగిన ఐక్యరాజ్యసమితి 93వ ప్లీనరీ సమావేశం తర్వాత, డిసెంబర్ 13, 1985న చేసిన 40/122 తీర్మానాన్ని గుర్తు చేస్తూ మాదకద్రవ్యాల పట్ల అవగాహన సమాజానికి తీసుకువచ్చే ప్రధాన సమస్యపై ప్రతి సంవత్సరం జూన్ 26వ తేదీని”మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం”గా గత 36 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామన్నార.
మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం ని పురస్కరించుకొని మత్తు పదార్థాల వినియోగం వల్ల ఏర్పడుతున్న దుష్ఫలితాల గురించి, అక్రమ రవాణాను అరికట్టడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశంతో మహిళ, శిశు,దివ్యాంగుల, వయో వృద్దుల మరియు ట్రాన్స్ జెండర్స్ వ్యక్తుల శాఖ, సమీకృత కలెక్టరేట్-నిర్మల్ నందు జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాన్ని జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది.
2023వ సంవత్సరం మాదకద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం యొక్క థీమ్ . ప్రజలు మొదట: కళంకం, వివక్షను ఆపండి, నివారణను బలోపేతం చేయండి. పలువురు అధికారులు తమ యొక్క సందేశాన్ని తెలిపారు .
ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి మాదక ద్రవ్యాల వినియోగ నిరోధం పై ముద్రించిన పోస్టర్లను,కరపత్రాలను ఆవిష్కరించారు.
అనంతరం మాదక ద్రవ్యాల వినియోగ నిరోధం పై వ్యతిరేకం గా సంతకాల సేకరణ జిల్లా పాలనాధికారి తో పాటు జిల్లా అధికారులు సంతకాలు చేశారు.
ఈ కార్యక్రమంలో . డి ఆర్ ఓ లోకేష్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె.విజయ లక్ష్మి, అన్ని జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.