మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మహాత్మా జ్యోతిరావు ఫూలే నేషనల్ అవార్డ్ గ్రహీతతీగల శ్రీనివాస్ రావు*
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 26 : మంచిర్యాల జిల్లా కేంద్రంలో బెల్లంపల్లి చౌరస్తాలో గల సర్కిల్ లో సంఘసంస్కర్త విద్యాప్రధాత మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహన్నీ ఏర్పాటు చేయాలని మహాత్మా జ్యోతిరావు ఫూలే నేషనల్ అవార్డ్ గ్రహీత తీగల శ్రీనివాస్ రావు అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సమాజంలో ఉన్న దూరచారాలను రూపుమపటానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి ,విద్య యొక్క విలువలను సమాజనికి తెలియజేసి సమాజంలో అందరు కూడా చదువుకొని జ్ఞాన వంతులు కావాలని ముఖ్యంగా చదువు ద్వారానే సమానత్వం వస్తుందని మహిళలు విద్యావంతులు కావాలని బాలికల పాఠశాలనే స్థాపించి మహిళలను జ్ఞానం వైపు నడిపించిన గొప్ప వ్యక్తి ఫూలే అన్నారు సమాజాన్ని పట్టి పీడిస్తున్న బాల్య వివాహాలు నిర్ములనకు ఎంతో కృషి చేసారు అని అన్నారు. వితంతు పునర్వివాహలకు జరిపించి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు మూఢ నమ్మకాల నిర్ములనకు ఎంతో కృషి చేసి విద్య ద్వారానే సమాజంలో గొప్ప మార్పు వస్తుందని వారి జీవితాన్నే సమాజ మార్పు కోసం త్యాగం చేసిన ఆ మహానుభావుని విగ్రహాన్ని మంచిర్యాల పట్టణ కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలోని సర్కిల్ లో ఏర్పాటు చేసి ఆ మహనీయుని ఆశయ సాధనకు, అతని అడుగు జాడల్లో సమాజం పయనించేలా కృషి చేయాలని ప్రభుత్వాన్ని స్థానిక అధికారులను నాయకులను కోరారు జిల్లాలోని ప్రతి ఒక్కరు ఆయన విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు కోరారు.