జిల్లా అదన కలెక్టర్ విజయేందర్రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 25:
15 వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిఆర్ఓ హరిప్రియతో కలిసి జిల్లా అదనపు కలెక్టరు ఉద్యోగులందరితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. డిఆర్ డిఎ ఆధ్వర్యంలో 15 వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు, విద్యార్థులు, యువకులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టరు మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఇప్పుడు ప్రతి ఏడాదికి నాలుగు సార్లు ఓటరుగా నమోదుకు అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ఓటరుగా నమోదుకు సమీపంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లి బిఎల్ఓలను సంప్రదించి ఓటరు నమోదుకు ఫామ్ – 6 తో పాటు, ఫామ్ – 6బి ద్వారా ఓటర్ గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని తెలియజేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోని, ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి ప్రజా ప్రతినిధులను ఎన్నుకున్నట్లయితే మన నియోజకవర్గాన్ని, జిల్లాను, రాష్ట్రాన్ని చక్కగా అభివృద్ధి పరచుకోగలుగుతామన్నారు . ఈ కార్యక్రమంలో లా ఆపీసర్ చంద్రావతి, జిల్లా భూసేకరణ అధికారి శంకర్ కుమార్, డిఆర్ డిఓ సంబశివరావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.ఓటు హక్కు పై నిర్వహించిన రంగోళీ పోటీలలో పాల్గొన్న విజేతలకు, స్వీప్ కార్యక్రమాలను బాగా ప్రచారం చేసిన టిఎస్ఎస్ కళాకరులకు జిల్లా అదనపు కలెక్టరు సర్టిఫికెట్లు, మెమెంటోలను ప్రధానం చేసారు.