ఘనంగా మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లాగౌడ్ వర్ధంతి

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 3 :

మందమర్రి పట్టణంలో ఘనంగా మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఎల్లా గౌడ్ 5 వ వర్ధంతి గురువారం పట్టణంలో పాత బస్టాండ్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నూరు మాజీ శాసనసభ్యులు నల్లాల ఓదెలు ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ కేంద్ర నాయకులు కాంపల్లి సమ్మయ్య మాట్లాడుతూ నోముల ఎల్లా గౌడ్ కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ లో తిరగాలంటే భయపడిన రోజుల్లో పార్టీని తన భుజస్కందాలపై వేసుకొని ముందుకు నడిపించే కాంగ్రెస్ పార్టీని కాపాడిన గొప్ప నేత ఎల్లాగౌడ్ అని అన్నారు. చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామిని, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణని కలిసి మందమర్రిలో నోముల ఎల్లా గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు గౌడ సంఘం నాయకులు నోముల ఎల్లా గౌడ్ కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking