విద్యార్థుల ఆంగ్ల భాష పరిజ్ఞానం దశల వారీగా పెరిగేలా చర్యలు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

 

ఆంగ్లంలో మాట్లాడేందుకు విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి

భాష పట్ల విద్యార్థులలో భయం, మొహమాటం తొలగించాలి

ఖమ్మం ప్రతినిధి జనవరి 03 (ప్రజాబలం) ఖమ్మం
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల భాష పరిజ్ఞానం దశల వారీగా పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు శుక్రవారం కొణిజర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాధమిక ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనీఖీ చేశారు. పాఠశాల నందు తరగతి గదులు, డిజిటల్ క్లాసు రూమ్ లు తిరిగి విద్యార్దులతో ముచ్చటించారు వి కెన్ లెర్న్ ఇంగ్లీష్ డిజిటల్ క్లాస్ రూంలో ఇంగ్లీష్ బోధనను కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం కాలంలో ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం, మాట్లాడే విధానం పై విద్యార్థులకు కలెక్టర్ అవగాహన కల్పించారు విద్యార్దులతో కలిసి ఇంగ్లీష్ లో మాట్లాడారు. తప్పు అయిన సరే మనం ఇంగ్లీష్ మాట్లాడడం రోజు ప్రయత్నించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ భోదన కార్యక్రమం అమలవుతున్న విధానం ఉపాధ్యాయులు చెప్పే బోధన, విద్యార్థుల భాషా పురోగతి పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు
వి కెన్ లెర్న్ ఇంగ్లీష్ భాషా అమలుపై జిల్లా కలెక్టర్ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు, ఆంగ్లం మాట్లాడటంలో విద్యార్థుల పురోగతి, పాఠశాల టైం టేబుల్, తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 34 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 6వ, 7వ తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సును విద్యార్థులు పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా చూడాలని అన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ లో విద్యార్థుల పురోగతి పరీక్షిస్తూ ఉండాలని, విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడుకునేలా మనం వారిని ప్రోత్సహించాలని అన్నారు విద్యార్థులు నమ్మకంతో ఆంగ్లంలో సునాయసంగా మాట్లాడేందుకు చాలా సమయం పడుతుందని, విద్యార్థుల స్థితి గతులను ప్రతి క్వార్టర్ కు పరీక్షిస్తూ విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు మనవంతు కృషి చేయాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు విద్యార్థులకు కాన్సెప్ట్ అర్థమయ్యేలా బోధన జరగాలని, క్లాస్ లో వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ద వహిస్తూ వారు కూడా ఆంగ్ల భాష మాట్లాడేలా చూడాలని అన్నారు విద్యార్థులు తప్పులు మాట్లాడినా వెంటనే కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదని, ముందు భయం, మొహమాటం లేకుండా విద్యార్థులు మాట్లాడడం ముఖ్యమని, విద్యార్థులలో నమ్మకం కలిగితే భాష నేర్చుకోవడం ఎక్కువ సమయం పట్టదని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ, కొణిజర్ల తహసీల్దారు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking