హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి జనవరి 3
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లందకుంటలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డిటిఎఫ్) ఉపాధ్యాయ సంఘ 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయపరమైనటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించి వారికి స్కేల్ తో కూడిన వేతనాన్ని మంజూరు చేస్తూ రెగ్యులర్ చేయవలెనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలైనటువంటి పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలు, పిఆర్సి నీ వెంటనే ప్రకటించాలని 317 ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారి స్థానికతను పరిశీలించి బదిలీ చేయాలని, భార్యాభర్తల ఉద్యోగులను వెంటనే ఒకే జిల్లాకు బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి ఏ బూసి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలైనటువంటి పి ఆర్ సి, పెండింగ్లో ఉన్న డిఎలు, 317 ద్వారా ఏర్పడిన ఉద్యోగుల సమస్యలు, ఉపాధ్యాయుల సర్దుబాటు, సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెలో ఉన్న కారణంగా వారి స్థానంలో రెగ్యులర్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం అసమాంజసమైనటువంటి ప్రక్రియ అని సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించి స్కేల్ తో కూడినటువంటి వేతనాన్ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల డిటిఎఫ్. అధ్యక్షులు సిహెచ్. వేణు, ప్రధాన కార్యదర్శి ఎస్. సంపత్ మరియు డిటిఎఫ్ సీనియర్ కార్యకర్తలు ఎం. సమిరెడ్డి, జి. ప్రకాష్, బాలరాజు, జి .అన్నపూర్ణ, జె. రాధికారానీ, సిహెచ్. కౌసల్య, సిహెచ్. రామకృష్ణ, ఎం. సుధాకర్, కే. శంకర్, కె. సత్యం, ఏ. సురేష్, ఏం. మనోహర్ రెడ్డి, డి. ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.