మహిళ ఉపాధ్యాయులకు సన్మానం

హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి జనవరి 3

తేదీ 03 :01: 2025 రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లందకుంటలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకోవడం జరిగింది.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి జి.అన్నపూర్ణ,జె. రాధికారాణి,సిహెచ్.కౌసల్య,డి. ఉమాదేవి లను ఘనంగా సన్మానించారు. పాఠశాల ఉపాధ్యాయులు సిహెచ్.వేణు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జనవరి 3న 1831 లో నైగా మహారాష్ట్ర రాష్ట్రంలోని సతారా జిల్లాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. 1840 సంవత్సరంలో జ్యోతిరావు పూలే తో వివాహము జరిగిన తర్వాత సావిత్రిబాయి పూలే విద్యభ్యాసము నేర్చుకుని భర్తతో కలిసి సామాజిక రుగ్మతలను కులమత బేధాలను బాల్య వివాహాలను రూపుమాపడానికి బాలికల విద్యను మెరుగుపరచడానికి ఎంతో కృషి చేశారు .పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయప్రకాష్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతీయ సంఘసంస్కర్త ఉపాధ్యాయిని రచయిత్రి మిన్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసినటువంటి జ్యోతిరావు పూలే ని 1840 లో వివాహం చేసుకున్నారు,భర్త జ్యోతిరావు పూలే సహకారంతో విద్యభ్యాసాన్ని నేర్చుకుని 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు.అలాగే సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు.స్ఫూర్తిదాయకంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సామాజిక రుగ్మతలను సాంఘిక దురాచారాలను విడనాడి దేశ అభివృద్ధికి కృషి చేయాలని తెలియజేశారు. పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులు జి. అన్నపూర్ణ,జె.రాధికారానీ,సిహెచ్. కౌసల్య,డి. ఉమాదేవి లను ఘనంగా సత్కరించడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. జయప్రకాష్, ఉపాధ్యాయులు సిహెచ్. వేణు,కే. శంకర్,ఎం. సమిరెడ్డి,కె. సత్యనారాయణ,ఏ. సురేష్ ,ఏ.మనోహర్ రెడ్డి,ఎం సుధాకర్, సిహెచ్. రామకృష్ణ, ఎస్. విశ్వతేజ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking