మహిళా జీవితాలకు అక్షర చుక్కాని సావిత్రిబాయి పూలే

-టి.జి.పి.ఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పులేటి నరేష్

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 3 :

అణగారిన మహిళల జీవితాలకు అక్షర చుక్కాని సావిత్రిబాయి పూలే అని తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పులేటి నరేష్ అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని ‘మహిళా ఉపాధ్యాయ దినోత్సవం’గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.శుక్రవారం మందమర్రి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలలో ముందుగా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పు కోసం సావిత్రి బాయి పూలే దంపతులు పునాది వేశారని, మహిళల విద్యకు ప్రాధాన్యం కల్పించారని, అణచివేతలకు గురైనవారికి న్యాయం అందించేందుకు తమ జీవితాన్ని అర్పించారని తెలిపారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. మహిళలను అక్షరాస్యులను చేయడానికి సావిత్రిబాయి పూలే ఎంతో శ్రమించారన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుపద్మజను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మంతెన సదానందం, ప్రధాన కార్యదర్శి బియ్యాల ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు పులిపాక శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి శానగొండ సంపత్, కోశాధికారి కొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking