యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్
హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి జనవరి 3
స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.నూతన వ్యవస్థ కోసం,ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలా మంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ, ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని, సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ మహానీయురాలి జయంతి జనవరి 3 వ తేదిని పురస్కరించుకొని, మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్ణయించడం అభినందనీయం అని అన్నారు. ఈ సందర్భంగా, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మంత్రి వర్గానికి గతంలో ఎన్నడు లేని విధంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.