ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జనవరి 3:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జనవరి 3వ తేదీన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్రమంతటా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంను జరుపుకొనుటకు ఆదేశాలు జారీ చేయబడినవి.
తదనగుణంగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పాఠశాలల యందు గల మహిళ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించడంమైనది. అదేవిధంగా విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయబడినది. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులను ఆయా పాఠశాలల యందు ఉపాధ్యాయ బృందము మరియు విద్యార్థులచే సత్కారము చేయబడినారు.