సర్పంచ్ లు మేధావులతో ఆత్మీయ సదస్సు
మీడియాతో ముఖాముఖి
ఖమ్మం ప్రతినిధి జనవరి 03 (ప్రజాబలం)ఖమ్మం
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కేఎ పాల్ రేపు ఖమ్మం రానున్నారు ప్రజాశాంతి పార్టీని మరింత ప్రతిష్ట పరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ లు, పలు సామాజిక వర్గాలకు చెందిన మేధావులతో జిల్లాల వారిగా ఆయన ఆత్మీయ సదస్సులను నిర్వహిస్తున్నారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికలే లక్ష్యంగా రానున్న గ్రామపంచాయతీ ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా క్యాంపియన్లు చెపడుతూ ఇప్పటికే పలు జిల్లాలలో సమావేశాలను పూర్తి చేశారు
ఈనెల 4 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మంలోని బైపాస్ రోడ్డు లోని కృష్ణ ఫంక్షన్ హాల్ లో మీడియాతో ఆయన సంభాషించనున్నారు. అనంతరం సర్పంచులు మేధావులతో జరిగే ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎంపీటీసీలు వివిధ సామాజికవర్గాల కు చెందిన మేధావులు పాల్గొని ఆత్మీయ సదస్సును విజయవంతం చేయాలని డాక్టర్ కె ఏ పాల్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు