రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 4 మార్చి 2025
భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ నాయకులు కార్యకర్తలు మొదలెట్టిన గుడ్ మార్నింగ్ మణికొండ మార్నింగ్ వాక్కు ప్రజల తరపున పూర్తి మద్దతు లభిస్తుందని భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ తెలుపుతూ సోమవారం ఉదయం పుప్పాలగూడ పరిధిలోని పెంటయ్య నగర్ 1 మరియు 2 ప్రాంతాల లోనీ ఇరుకుగా ఉన్న వీధి వీధికి తిరుగుతూ ప్రజాభిప్రాయ సేకరణలో అసంపూర్తిగా ఉన్న చిన్న పాటి రహదారులతో పాటు డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేని, కుప్పితొట్టిగా కుప్పలు కుప్పలుగా చెత్తాచెదరం పడి ఉండి దోమల బెడదతో తీవ్ర ఇబ్బందిగా ఉందనీ, మంచి నీటి సరఫరా కూడా సరీగా లెనందువలన ఇక్కట్ల పాలౌతున్నామని స్తానిక ప్రజలు తమ భాదలను ఏకరువు పెట్టినారు. ఇట్టి ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా స్థానికంగా ఉన్న హోటల్ కు సంబంధించిన చిమ్నీల ద్వారా వచ్చే వేడి ఆవిరి వల్ల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురి అవుతున్నారని మరియు అనుమతి లేకుండా వంట గ్యాస్ సిలిండర్ల మార్పిడి పెద్ద ఎత్తున చురుకుగా సాగుతుందన్న విషయం గమనించడం జరిగింది, అగ్ని మాపక వాహనము కూడా వెళ్ళలేని ఆ ఇరుకు సందుల్లో గ్యాస్ మార్పిడి వల్ల అనుకోని ప్రమాదం జరుగుతే అక్కడ నివసించే ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్న సంగతి గమనించి ఇట్టి విషయమై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రమాదం వాటిల్లక ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ డిమాండు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో గుట్టమీది నరేందర్, గోరుకంటి విఠల్, ఉపేందర్నాధ్ రెడ్డి, సంఘం శ్రీకాంత్, కీర్తి లత గౌడ్, మాల్యాద్రి నాయుడు, బండమీది మల్లేష్, కిరణ్ యాలాల, కృష్ణ రాజీ, సుమనళిని, భాను చందర్, కందాట ప్రవీణ్, రమణ మూర్తి తది తరులు పాల్గొన్నారు.
