పవిత్ర రంజాన్ కు ఏర్పాట్లను పూర్తి చేయాలి.

అదనపు కలెక్టర్ సి హెచ్ మహేందర్ జి.
ప్రజాబలం ప్రతినిధి
తేది.05.3.2025.
ములుగు జిల్లా.
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అదనపు కలెక్టర్ సి హెచ్ మహేందర్ జి. అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ సి హెచ్ మహేందర్ జి., అధికారులతో సమావేశమై, రంజాన్ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లకు తావులేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, గ్రామాలలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా సమన్వయంతో పని చేయాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా ఎక్కడ కూడా తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి బాధ్యతలు పురమాయిస్తూ, నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం అంతరాయం లేకుండా చూడాలని, వీధి లైట్ల మరమ్మతులు జరిపించాలన్నారు.
బోర్లు, పైప్ లైన్ మరమ్మతులు ఉంటే ముందస్తుగా చేపట్టాలని తెలిపారు.
అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ప్రార్థనా సమయాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖకి సూచించారు. మసీదులు, ఈద్గాల వద్ద పారిశుధ్య సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. కాగా, వేసవి సీజన్ ప్రారంభం అవుతున్న దృష్ట్యా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు.

రంజాన్ పండుగ రోజు శ్యామ్యానాలు తాగునీరు తదితర ఏర్పాట్లు చేయాలని, రంజాన్ హోలీ, ఉగాది పండుగలకు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

రంజాన్ పండుగ రోజు ములుగు ఈద్గాలో దాదాపు 5 వేల మంది ప్రార్థనలో హాజరు అవు తారని, అలాగే అన్ని మండల కేంద్రము లలోని ఈద్గాలలోఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సి హెచ్ రవీందర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలు మిర్టీ రహమతుల్లా బేగ్, హజీ ఆబ్దుల్లాహ్ బిన్ ఆహ్మమద్ సయాద్ షకిల్, రియాజ్ మిర్జ, ఖుతుబద్దిన్, ఆబ్బుల్ రబ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking