ప్రసాద్ స్కీమ్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ప్రజాబలం ప్రతినిధి
తేది: 05.03.2025
ములుగు జిల్లా.
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి రానున్న రోజులలో విదేశీ పర్యటకులు పెద్ద ఎత్తున రానున్నారని, ప్రసాద్ స్కీమ్ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.
మంగళవారం వెంకటాపూర్ మండలం పాలంపేట లోని రామప్ప లో ప్రసాద్ స్కీమ్ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతొ కలసి పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రానున్న మే రెండో తేదీన ప్రపంచ సుందరి పోటీలు జరుగుతున్న నేపథ్యంలో పలు దేశాలకు చెందిన పోటీ మహిళలు పోటీ హైదరాబాద్ కు రానున్న సందర్భంలో జిల్లాలోని పర్యాటక స్థలాలను పర్యటించే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని సంబంధిత శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రసాద్ స్కిం ద్వారా చేపట్టిన పనులను ఏప్రిల్ 20 వ తేది లోపు పూర్తి చేయాలని, రామప్ప పరిసర ప్రాంతాన్ని సుందరికరించి గ్రీనరీ పెంచాలని అధికారులకు సూచించారు. కాకతీయ కట్టడాలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి విదేశీ పర్యటకులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో మొదటిసారిగా ప్రపంచ సుందరి పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా ఆయా దేశాల సుందరి మనలను పర్యాటక ప్రాంతాలకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఆయన వివరించారు. ప్రపంచ దేశాల పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్,
డి పి ఓ దేవ్ రాజ్, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ సూర్య కిరణ్, పర్యాటక అభివృద్ధి సంస్థ డి ధనరాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ కుమార్, ఎంపీడీవో రాజు, తహసిల్దార్ గిరిబాబు, ఎంపీఓ, విష్ణువర్ధన్ సైట్ ఇంచార్జీ, తదితరులు పాల్గొన్నారు.