అటవీ శాఖ కార్యాలయంలో హస్తకలలపై శిక్షణ కార్యక్రమం

ప్రజా బలం ప్రతినిధి:
తేదీ:05.03.2025
ములుగు జిల్లా

ములుగు జిల్లా అటవీశాఖ కార్యాలయంలో ఎస్ & టి సిరి వాలంటరి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా లోని మేదరి కులస్టులకు అటవీ శాఖ ఆధ్వర్యంలో చేతి వృత్తులపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో హార్నమెంటల్ (బాంభో) సామాగ్రి ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం లభించే విధంగా వస్తువులు తయారు చేయడం పై మధ్యప్రదేశ్ కి చెందిన ఇద్దరు ట్రయినలర్లు ద్వారా 30 మంది ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ములుగు డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ పాల్గొని చేతివృత్తుల ద్వారా చేసే వస్తువులకు సమాజంలో విపరీతమైన ఆదరణ పెరిగిందని దీనిని మేదరకులస్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన తెలియజేశారు. దీనికోసం ప్రభుత్వం ద్వారా సహాయం చేయడం జరుగుతుందని, దీంతో చేతి వృత్తుల వారికి సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయని ఆయన తెలిపారు. నెలరోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఇవ్వడంతో పాటు ఇక్కడ తయారు చేసిన వస్తువులను స్టాళ్ళ రూపంలో మార్కెట్లో అమ్మడం కోసం ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ములుగు ఎఫ్ఆర్ఓ డోలి శంకర్,ఎఫ్బిఓ శ్యామ్ సుందర్,శివ కృష్ణ తో పాటు ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking