కబ్జా కోరల్లో పుల్కల్ గ్రామపంచాయతీ భూమి

 

– అన్యక్రాంతమవుతున్న ప్రభుత్వ భూమి

– ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి కొమ్ముకాస్తున్న పంచాయతీ కార్యదర్శి

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 4( ప్రజాబలం) సంగారెడ్డి జిల్లా: పుల్కల్ మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్లో ఉన్న ఖాళీ స్థలంలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఒన్న పురం కిట్టు. ఇతనికి తండ్రి లేడు, కనీసం గుంట భూమి కూడా లేదు, జీవనోపాధి కోసం మార్కెట్లో ఉన్న ఖాళీ స్థలంలో ఒక డబ్బాను పెట్టుకున్నాడు డబ్బా పెట్టుకున్న వారం రోజులు కాకముందే గ్రామపంచాయతీ కార్యదర్శి ఇరుగు పొరుగు వారి మాటలను విని అక్కడినుండి పోలీసుల సహాయంతో డబ్బును తొలగించటం జరిగింది, డబ్బాను తొలగించడమే కాకుండా దాన్ని రోడ్డుకి అడ్డంగా పెట్టారు, సదురు వ్యక్తి ఎందుకు నా డబ్బాను తొలగించవలసిన అవసరం వచ్చిందని కార్యదర్శిని అడుగగా, ఇది ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వ భూముల్లో ఎవరు ఏదైనా చేసుకోవచ్చ అని పుల్కల్ కార్యదర్శి, పెత్తందారులకు కొమ్ముకాస్తూ నిరుపేదల పట్ల చిన్నచూపు చూడడం ఎంతవరకు సమంజసం అని డబ్బాయజమాని, ఒన్న పురం కిట్టు, కన్నీరు మున్నేరు పెట్టుకున్నాడు, ఇది ముమ్మాటికి పుల్కల్ గ్రామస్తులు రాజకీయాలు చేసి ఓ నిరుపేద వ్యక్తి చిరువ్యాపారం డబ్బాని పెట్టుకుంటే, గ్రామంలో చెలమణి అవుతున్న అధికార పార్టీ రాజకీయా నాయకులు, గ్రామ కార్యదర్శి తో కుమ్ముకై గ్రామపంచాయతీ స్థలంలో పెట్టుకున్న డబ్బాను ఏ అధికారం తోటి ఎందుకు తొలగించవలసి వచ్చిందో కార్యదర్శి సంజాయిసి ఇవ్వాలని లేదా కూరగాయల మార్కెట్లో పెద్ద మోరి పైన ఉన్న డబ్బాలను పెట్టుకోవడానికి ఎవరు అనుమతించారో వెంటనే గ్రామ కార్యదర్శి స్పందించి అక్కడ ప్రభుత్వ స్థలంలో ఉన్న డబ్బాలను ఖాళీ చేయించాలని, లేనియెడల పంచాయతీ కార్యదర్శి పై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు, అప్పటికి కార్యదర్శి నిర్లక్ష్యం వహిస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆయన అన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking