రాంరెడ్డి వెంకట్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్
ఇల్లందు ప్రతినిధి మార్చి 4 (ప్రజాబలం) ఇల్లందు నియోజకవర్గం రాజకీయాల కంటే వ్యక్తిత్వ విలువలు ను గౌరవించే వ్యక్తి, నిక్కచ్చితమైన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం, నేటి రాజకీయాలకుదివంగత నేత రాo రెడ్డి వెంకట్ రెడ్డి ఆదర్శ వ్యక్తి అని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పేర్కొన్నారు కామేపల్లి మండలం కొత్త లింగాల క్రాస్ రోడ్ లో దివంగత నేత మాజీ మంత్రివర్యులు రాo రెడ్డి వెంకట్ రెడ్డి 9వ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా డిసిసిబి డైరెక్టర్ మాజీ జడ్పిటిసి మేకల మల్లిబాబు యాదవ్ తో పాటు పలువురు నేతలు వారి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ ఈనాడు రాజకీయాలు ఎంతో కల్మషం అయినప్పటికీ రాజకీయాలు శాశ్వతం కాదు వ్యక్తిత్వ విలువలే ప్రధానమని నిరూపించడం వలన ఇప్పటికీ ప్రతి తండాలో ప్రతి హరిజనవాడలో, ప్రతి గుండెలో చిరస్థాయిగా రాంరెడ్డి వెంకట్ రెడ్డి నిలిచిపోయారని, తెలిపారు. కన్నతల్లికి కష్టమొచ్చినా ఓర్చుకుంటాను గాని కార్యకర్తలకు కష్టం వస్తే సహించను అనేవారని, మాటలతో కాకుండా చేతలతో, ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీ కార్యకర్తలను, వెన్నంటి కాపాడుకున్న మహా వ్యక్తి అని, తన జీవితకాలంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీని వీడిపోని గుండె ధైర్యం గల వ్యక్తి రాంరెడ్డి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, డిసిసిబి డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, నాయకులు తోటకూరి శివయ్య, నల్లమోతు లక్ష్మయ్య గుజ్జర్లపూడి రాంబాబు, రాo రెడ్డి జగన్నాథ్ రెడ్డి, ధరావత్ అనురాధ,కోటి, దొడ్డ వేణు, బట్టు నాగ బానోతు లాల, సిరిపురపు రవి, వీరస్వామి, మాలోత్ ప్రేమ్ కుమార్ పందుల రామ్మూర్తి మరియు తదితరులు పాల్గొన్నారు
